ట్రంప్ ప్రభుత్వం DACA విద్యార్థులపై కొరడా
అమెరికా వ్యాప్తంగా 650,000 మంది వలసదారుల పిల్లలు బహిష్కరణకు భయపడకుండా అమెరికాలో నివసించడానికి మరియు పని చేయడానికి అనుమతించే DACA (Differed Action for Child Arrivals – one of the Immigration programs) కార్యక్రమానికి కొత్త దరఖాస్తులను తిరస్కరించడం కొనసాగిస్తుంది అని అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లోని డిపార్ట్మెంట్ అఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పినట్లు యూస్ఏ టుడే వెల్లడించింది.
అద్ధ్యక్షులు ట్రంప్ అధికారులు “DACA కార్యక్రమాన్ని ముగించే నిర్ణయం చట్టవిరుద్ధమని హైకోర్టు వెల్లడించలేదు, హైకోర్టు ప్రభుత్వం DACA కార్యక్రమాన్ని ముగించే విధానాన్ని మాత్రమే తప్పు పట్టింది” అని తెలిపారు. జూన్ 18 సుప్రీంకోర్టు DACA కార్యక్రమం యధావిధిగా నడపాలి అని ఇచ్చిన తీర్పు తర్వాత అద్ధ్యక్షులు ట్రంప్ ఈ కార్యక్రమాన్ని తిరిగి సందర్శిస్తానని మరియు ఇమ్మిగ్రేషన్లో భారీ మార్పులు చైయటానికి కార్యనిర్వాహక చర్యల ద్వారా తాను ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేసిన తర్వాత DACA కార్యక్రమానికి కొత్త దరఖాస్తులను తిరస్కరించడం వలసదారులు అయ్యోమయ్యం లో పడ్డారు అని యూస్ఏ టుడే తెలిపింది.













