డొనాల్డ్ ట్రంప్ కు ఒకేసారి రెండు ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఒకేసారి 2 ఎదురు దెబ్బలు తగిలాయి. ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమ మాజీ చైర్మన్ పాల్ మానఫోర్ట్ ఆర్థిక అక్రమాల కేసులో దోషిగా తేలారు. ఇటు ట్రంప్‌తో ఉన్న లైంగిక సంబంధాల గురించి బయటపెట్టకుండా ఉండేందుకు అశ్లీల చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించినట్లు, ఆయన న్యాయవాది మైకెల్ కోహెన్ ఓ కోర్టులో అంగీకరించారు. 2016లో అమెరికా అధ్యక్ష పోటీలో ఉన్న వ్యక్తి ( ట్రంప్)తో తమకున్న లైంగిక సంబంధాల గురించి వివరాలు బయట పెట్టాలనుకున్న ఇద్దరు మహిళలను, డబ్బు ముట్టజెప్పి మౌనం వహించేలా చేసినట్లు కోహెన్ ఒప్పుకొన్నారు. పన్ను ఎగవేత, బ్యాంకుకు అసత్యపు వివరాలు ఇవ్వడం, ప్రచార కార్యక్రమ ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించడం వంటి నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈ కేసులో ట్రంప్ పేరును కోర్టు పత్రాలు నేరుగా ప్రస్తావించలేదు. కోహెన్‌కు డిసెంబర్ 12న శిక్ష ఖరారు కానుంది. ట్రంప్‌నకు తీవ్ర ప్రతికూలమైన పరిణామం.













