త్వరలో చర్చలు ప్రారంభం : ట్రంప్
చైనాతో రెండో దశ వాణిజ్య ఒప్పంద చర్చలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య విషయంలో కొంతవరకు ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ అమెరికా-చైనా మధ్య మునుపెన్నడూ మెరుగైన సంబంధాలు లేవన్నారు. అయినప్పటికీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తనకు మంచి సంబంధాలున్నాయని డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పేర్కొన్నారు. ప్రపంచంలో ఇదివరకెన్నడూ, ఎక్కడా లేనంత వృద్ధి సాధించే దిశగా అమెరికా పయనిస్తోందని ట్రంప్ అన్నారు. ఇది ఆశావహంగా ఉండాల్సిన సమయమే తప్ప నిరాశావాదానికి చోటు లేదన్నారు.













