డెమొక్రాట్లను నిందించిన డొనాల్డ్ ట్రంప్
తమ న్యాయవాది మైకేల్ కొహెన్‌ను విచారించాలన్న డెమొక్రాట్స్ నిర్ణయం వల్లే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో తాను ఇటీవల జరిపిన మలి భేటీ విఫలమై వుండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఒక అబద్దాల కోరును, మోసకారిని బహిరంగంగా విచారించాలని డెమొక్రాట్స్ నిర్ణయించిన సమయంలోనే ఉత్తర కొరియా అధినేతతో అత్యంత ప్రధానమైన అణు భేటీ జరిగిందని, అమెరికన్ రాజకీయాలలో ఇది అత్యంత హేయమైన పరిస్థితి ఇది అని తన ట్వీట్లో వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడు విదేశీ పర్యటనలో వుండగా ఇటువంటి పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదని ఆయన వివరించారు. గత వారం వియత్నాం రాజదాని హనోయ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్‌తో భేటీ అయిన సమయంలోనే ట్రంప్ మాజీ సలహాదారు, న్యాయవాది అయిన కొహెన్‌ను ప్రతినిధుల సభాసంఘం విచారించిన విషయం తెలిసిందే.













