ఆ నిషేధాన్ని తిరిగి అమల్లోకి తేవాలి…..సుప్రీం కోర్టు
ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా విధించిన వివాదస్పద నిషేధాన్ని, తిరిగి అమల్లోకి తేవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ దేశ సుప్రీం కోర్టును కోరింది. దేశ భద్రత కోసం తన అధికార పరిధి మేరకే అధ్యక్షుడు ట్రంప్ ఈ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ అంశంపై తమ వాదనలను వినాలని కోరింది. ఇరాన్, లిబియా, సొమాలియా, సూడాన్, సిరియా, యెమెన్‌కు చెందినవారిని తమ దేశంలోకి రానివ్వకుండా, ట్రంప్ జనవరిలో తొలిసారి నిషేధాజ్ఞలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అమెరికా కోర్టులు నిలుపుదల చేశాయి. న్యాయపరమైన సవాళ్లను అధిగమించేందుకు మార్చిలో మరోసారి, ఆరు దేశాల పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తూ ట్రంప్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డ నాలుగో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు, అమల్లోకి రాక ముందే ఈ ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. దీంతో తాజాగా కిందు కోర్టుల నిర్ణయాలను సవాలు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.













