హెచ్ 4 వీసాలను అడ్డుకోవద్దు
హెచ్ 4 వీసాల రద్దుపై అమెరికా యుటర్న్ తీసుకుంది. హెచ్ 4 ఈఏడీని (ఎంప్లాయింట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) అడ్డుకోవద్దని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ కొలంబియాకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోం లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) కోరింది. హెచ్ 1బీ వీసాదారుల భాగస్వాములు చట్టబద్ధంగా పనిచేసేందుకు హెచ్ 4 వీసా వీలు కల్పిస్తుంది. హెచ్ 1బీ వీసాదారుల్లో మూడింట రెండొంతులు భారతీయులే. హెచ్ 4 నిబంధన వల్ల స్థానికులకు ఐటీ ఉద్యోగాల్లో తగ్గదుల ఉన్నట్టు ఆధారాలేవీ లేవని డీహెచ్ఎస్ తెలిపింది. సర్కారుకు అనుకూలంగా తీర్సు వస్తే లక్షకు పైగా భారతీయు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.













