TLCA: టిఎల్ సిఎ వైద్య శిబిరం విజయవంతం
న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA), అసమై హిందూ టెంపుల్ (Hindu Temple) తో కలిసి నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా రోగులను వైద్యుల బృందం పరీక్షించింది. బిపి, షుగర్, కొలెస్ట్రాల్, ఫిజికల్ థెరపి ఎవల్యూషన్, బిఎంఐ టెస్టింగ్, మెంటల్ హెల్త్ స్క్రీనింగ్, పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ మెడికల్ ఐడీ కార్డులు, ఇకెజి టెస్టింగ్, ప్లూ వ్యాక్సిన్ల పంపిణీ, ఉచిత రీడింగ్ అద్దాల పంపిణీ వంటి సేవలను ఈ ఉచిత వైద్య శిబిరంలో అందించారు. రోగులకు అవసరమైన సలహాలతోపాటు మందులను ఇచ్చారు. డాక్టర్లు రాజావర్మ, సుజనీ వర్మ, బంగారురాజు కొలనువాడ, ఇల్లోర రఫీక్, నీరు కుమార్, గుర్వీందర్ సిద్ధుకుమార్, దాక్షాయని ఆర్ గుట్ట, రాజేశ్ కాకాని, తేజ్ ప్రీత్ సింగ్, శైలజ దామినేని, తరుణ్ వాసిల్, అశోక్ కుకాడియా, సుధ కుంచం, పూర్ణ అట్లూరి, కృష్ణారెడ్డి గుజవర్తి, స్వర్ణలత అల్లూరి, శరత్ వదాద, సునీల్ మెహ్రా, అమిత్ పాండ్య, భామ కొల్లా తదితర డాక్టర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు.
ఈ వైద్యశిబిరాన్ని విజయవంతం చేసినవారందరికీ టిఎల్ సిఎ అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో నిర్వహించే ఉగాది వేడుకలను కూడా జయప్రదం చేయాలని కోరారు. డాక్టర్లు రాజా, సుజనివర్మ ఈ వైద్య శిబిరాన్ని స్పాన్సర్ చేశారు యూత్ కో ఆర్డినేటర్లు దియా వర్మ, దివ్య దొమ్మరాజుతోపాటు టిఎల్‌సిఎ ఇసి సభ్యులు, ట్రస్టీలు పాల్గొన్నారు.







