ప్రపంచ అత్యుత్తమ సీఈఓల్లో మనోళ్లు ముగ్గురు
అంతర్జాతీయ కార్పొరేట్ ప్రపంచంలోనూ భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. మంచి పనితీరుతో తమ కంపెనీలను ముందుకు నడిపిస్తూ అంతర్జాతీయ వ్యాపార పత్రికల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రపంచంలోని టాప్-10 సీఈఓల్లో ఈ సంవత్సరం ప్రవాస భారతీయులు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగాకు చోటు దక్కింది. వీరిలో శంతను నారాయణ్ ఆరో స్థానం, అజయ్ బంగా ఏడో స్థానంలో నిలవగా, సత్య నాదెళ్ల తొమ్మిదో స్థానం సంపాదించారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పత్రిక ది బెస్ట్ పర్ఫార్మింగ్ సీఈఓస్ ఇన్ ది వరల్డ్, 2019 పేరుతో ఈ జాబితా విడుదల చేసింది. ఎన్విడియా కంపెనీ సీఈఓ జెన్సెన్ హుయాంగ్ టాప్-10 సీఈఓల జాబితాలో అందరికంటే ముందున్నారు. టాప్-100 సీఈఓల జాబితాలో డీబీఎస్ బ్యాంక్ సీఈఓ పీయూష్ గుప్తాకు 89వ స్థానం లభించింది. ఏటా ఈ జాబితాలో టాప్‌లో ఉండే అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌కు ఈ సంవత్సరం అసలు చోటే దక్కలేదు.













