కన్నీరుతో కరోనా ముప్పు లేదు
కరోనా గాలిలో వ్యాపించే వైరస్ కాదు.. డ్రాప్లెట్ వైరస్. అంటే తుమ్ము, దగ్గు తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది’.. అని వైద్యులు చెబుతున్నారు. మరి డ్రాప్లెట్ వైరస్ అంటే కన్నీటి ద్వారా వ్యాపిస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. సింగపూర్‌కు చెందిన శాస్త్రజ్ఞులు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరోనా సోకినవారి కన్నీరు మన మీద పడినా.. దాన్నుంచి వైరస్ వ్యాపించదని, ఆ నీటిలో వైరస్ ఉండదని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా వారు కొవిడ్-19 బారిన పడిన 17 మంది కన్నీటి చుక్కలను వారికి నయమయ్యే దాకా రోజూ సేకరించి పరీక్షించారు. రోగుల ముక్కు, నోటి స్రావాల్లో ఉన్న వైరస్.. వారి అశ్రువుల్లో మాత్రం లేదని వారి పరీక్షల్లో తేలింది.













