కొడితే ఇంకా చెడతారు!
పిల్లలను చీటికీ మాటికీ కొట్టడం, బెదిరించడం వల్ల వారి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పురాకపోగా, మరింత మొండిగా తయారవుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పిల్లల చెడు ప్రవర్తనకు వారి తల్లిదండ్రులు, ఇంటి వాతావరణం లేదా మరేదో కారణం కాదట. చిన్న చిన్న తప్పులకు వారిని కసురుకోవడం కొట్టడమే అందుకు కారణమని అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. దండనకు గురవని పిల్లలతో పోలిస్తే తల్లిదండ్రులు తరచూ కొట్టే పిల్లల్లో 6 లేదా 8 ఏళ్ల వచ్చే సరికి పెంకి ప్రవర్తన పెరిగిపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారట. దండన అనేది పిల్లలకు ఏ విధంగా శ్రేయస్కరం కాదని వారంటున్నారు.













