ప్రధాని మోదీతో ఎలాన్ మాస్క్ భేటీ… త్వరలో భారత్ కు
భారత్‌లో టెస్లా కంపెనీ ఏర్పాటు చేస్తామన్న విశ్వాసం ఉన్నట్లు ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ అన్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగానే టెస్లా సంస్థను ఇండియా లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారత భవిష్యత్తుపై తనకు నమ్మకం ఉందని, ప్రపంచదేశాల్లో ఆ దేశానికి ప్రత్యేక స్థానం ఉందని మస్క్ అన్నారు. భారతీయ మార్కెట్‌పై ఆసక్తి ఉందా అని వెల్లడిరచారు. ఎనర్జీ నుంచి ఆధ్మాత్మికత వరకు అనేక అంశాలపై మస్క్‌తో చర్చించానని ప్రధాని తెలిపారు. వచ్చే ఏడాది ఇండియాలో పర్యటించనున్నట్లు మస్క్ వెల్లడిరచారు.













