గంట వ్యవధిలోనే ఆయన సంపద 16 వేల కోట్లు!
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి స్టాక్ మార్కెట్ పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన సారథిగా ఉన్న విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకుపోవడంతో ఎలాన్ వ్యక్తిగత సంపద అనూహ్యంగా పెరిగింది. కేవలం గంట వ్యవధిలోనే ఆయన సంపద విలువ 2.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16,443 కోట్లు) పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు గడించడంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ల విలువ 12 శాతం పెరిగింది. దీంతో ఆయన వ్యక్తిగత సంపద విలువ 36 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో వెల్లడైంది. టెస్లా కంపెనీలో ఎలాన్ దాదాపు 20 శాతం వాటా కలిగి ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాల్యూ దాదాపు 100 బిలియన్ డాలర్లు.













