“తెలుగే గొప్ప భాష – కానీ కనుమరుగౌతున్నది” – అంతర్జాలం లో అందుబాటు
ఈ నాటి తెలుగు బాష మనుగడకీ, పురోగతికీ ప్రస్తుతం ఉన్న అవరోధాలని సోదారహణగా వివరిస్తూ, ఆ అవరోధాలని అధిగమించడానికి ప్రభుత్వాలూ, సామాన్య ప్రజలూ ఉద్యమించి అవలంబించవలసి ఆచరణ సాధ్యమైన పనులను సశాస్త్రీయంగా ప్రతిపాదిస్తూ శ్రీ పారుపల్లి కోదండ రామయ్య గారు రచించిన చిన్న పొత్తం “తెలుగే గొప్ప భాష – కానీ కనుమరుగౌతున్నది” ఇప్పుడు అంతర్జాలంలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లంకె కి వెళ్లి ఈ నాటి భాషోద్యమంలో బహుశా తొలి గ్రంధమైన ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్సును. లేదా ‘అద్దె’ కి తీసుకుని చదవ వచ్చును. ఇది వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 77వ తెలుగు ప్రచురణ.
http://kinige.com/book/Teluge+Goppa+Bhasha+Kani+Kanumarugoutunnadi
గత ఏప్రిల్ 15, 2019 నాడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు డా. కె.వి. రమణ గారు, మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మక మరియు సంస్కృతీ సమితి ముఖ్య నిర్వహణాధికారి డా. దీర్ఘాసి విజయ కుమార్ గారూ, దేవులపల్లి ప్రభాకర రావు గారు. చెన్నూరు ఆంజనేయ రెడ్డి, ఆవుల మంజులత, కె. శ్రీనివాస్, అద్దంకి శ్రీనివాస్, తదితర భాషాభిమానులు పాల్గొన్న సభలో ఈ పొత్తం ఆవిష్కరణ ఘనం గా జరిగింది అని విదితమే. ఆ సందర్భంగా ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామోజీ రావు గారి ఉత్తరం రూపంలో మాకు పంపించిన వ్యక్తిగత స్పందన, ఆంధ్రభూమి,వార్త, ఈనాడు పత్రికలలో ప్రముఖంగా ప్రకటించ బడిన వార్తా విశేషాలు ఇందుతో జతపరుస్తున్నాం. ఆ ఆవిష్కరణ సభా విశేషాలని, తెలుగు భాష ప్రస్తుత పరిస్టితి పై అందరి ఆవేదన గురించి అన్ని టీవీ ల వారూ తమ ప్రత్యేక ప్రసారాలు చేశారు.
ప్రస్తుత పరిస్థితులలోఈ పుస్తకంలో పొందుపరచబడిన అంశాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ చదివి ద్విగిణీకృతమైన ఉత్తేజంతో తెలుగు భాష పురోగతి కి, భాషోద్యమానికి తోడుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది.
“తెలుగే గొప్ప భాష -కానీ కనుమరుగౌతున్నది” పుస్తకం అచ్చు ప్రతులు నవోదయా (హైదరాబాద్) మరియు అంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో ఉన్న పుస్తక విక్రయశాలలలో దొరుకుతాయి. లేదా నన్ను కానీ ఈ క్రింది వారిని కానీ సంప్రదించండి.
రచయిత పారుపల్లి కోదండరామయ్య: korapa4@gmail.com
వంశీ రామరాజు (వంగూరి ఫౌండేషన్, హైదరాబాద్): ramarajuvamsee@yahoo.co.in
వంగూరి చిట్టెన్ రాజు
Phone: 832 594 9054













