టాటా ఆధ్వర్యంలో కోవిడ్ ఫై అవేర్ నెస్ సమావేశాలు
తెలంగాణ అమెరికా తెలుగుసంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం విజయవంతమైంది. అట్లాంటాకు చెందిన ఇంటర్నల్ మెడిసిన్, ఇన్పెక్షియస్ డిసీజెస్‌లో డాక్టర్‌గా ఉన్న మాధవి రాయపూడితో ఓ సమావేశాన్ని టాటా ఏర్పాటు చేసింది. మార్చి 15వ తేదీన ఏర్పాటు చేసిన ఈ వెబినాయర్లో ఎంతోమంది పాల్గొని తమ సందేహాలను, సమస్యలను తెలియజేశారు. డా మాధవి కోవిడ్ 19 వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సమావేశంలో తెలియజేసింది. టాటా అధ్యక్షుడు భరత్మాదాడి ఆధ్వర్యంలో పలువురు టాటా నాయకులు తెలుగు ఎన్నారైలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు.













