ఏసియా ఫెస్ట్ బోట్ రేస్‌లో తానా
                                    నార్త్ కరోలినా ఏసియా ఫెస్ట్ లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన నిర్వహించిన బోట్ రేస్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ర్యాలీ చాప్టర్ సభ్యులు పాల్గొన్నారు. ఏసియన్ ఫోకస్ ఆఫ్ నార్త్ కరోలినా ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ ఏసియా ఫెస్ట్ బోట్ రేస్ లో తానా ర్యాలీ చాప్టర్ గత 5 సంవత్సరాలుగా పాల్గొంటూ వస్తుంది. చుట్టుపక్కల పట్టణాలైన క్యారీ, మోరిస్విల్ మేయర్లు, ఫస్ట్ రెస్పాండెర్స్ మరియు చార్లెట్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ నుంచి హేమాహేమీలు పాల్గొన్న ఈ బోట్ రేస్ లో పోటాపోటీగా తానా ర్యాలీ చాప్టర్ సభ్యులు పాల్గొనడం విశేషం. తానాలో ముఖ్య భాగమైన టీం స్క్వేర్ అందిస్తున్న సామాజిక సేవలకు ఈ బోట్ రేస్ ని అంకితం చేస్తూ అందరూ ఏంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 28, శనివారం రోజున నిర్వహించిన ఈ బోట్ రేస్ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. హెల్త్ ఫెయిర్, ఫుడ్ స్టాల్ల్స్‌ను కూడా ఏసియా ఫెస్ట్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. ఒక పక్క ప్రవాసులు ఛీర్ చేస్తుండగా మరోపక్క తానా ర్యాలీ చాప్టర్ సభ్యులు అత్యంత ఉత్సాహంగా బోటింగ్ చేశారు. ట్రూవాల్ రియాల్టీ నుంచి లక్ష్మి నరేశ్ కొసరాజు వీరికి స్పాన్సర్ చేసి మద్దతుగా నిలిచారు. అలాగే భారత్ కేఫ్ నుంచి చారి కంబర మరియు మహేష్ సుంకు భోజనాలు అందించారు.
తానా అపలాచియన్ ప్రాంత సమన్వయకర్త రాజేష్ యార్లగడ్డ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే టీం స్క్వేర్ కి మద్దతుగా ఈ బోట్ రేస్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ణఙవసఙjస్త్ర. R బోట్ రేస్ ని లీడ్ చేసిన తానా బోట్ టీం కెప్టెన్ రఘు వాడుకని అభినందించారు.
ఈ కార్యక్రమంలో తానా టీం స్క్వేర్ ఛైర్మన్ కిరణ్ కొత్తపల్లి మరియు తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని, చార్లెట్ నుంచి వచ్చి ఈ బోట్ రేస్ లో పాల్గొన్నారు. ర్యాలీ సిటీ టీం స్క్వేర్ ఛైర్ ప్రవీణ్ తాతినేని ఈ కార్యక్రమానికి లాజిస్టిక్స్ విషయంలో సహాయం చేశారు. తానా బోట్ రేస్‌లో పాల్గొని విజయవంతం చేసిన ర్యాలీ వాసులకు, ఎప్పటిలానే ఈ కార్యక్రమానికి కూడా వెన్నుదన్నుగా నిలిచిన తానా ర్యాలీ టీం కి, వాలంటీర్స్ కి, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ తానా అపలాచియన్ ప్రాంత సమన్వయకర్త రాజేష్ యార్లగడ్డ ధన్యవాదాలు తెలియజేశారు.







