మే 9న తానా ఆధ్వర్యంలో మ్యూజిక్ మస్తీ కార్యక్రమం
వివిధ సేవా కార్యక్రమాలతోపాటు కళాకారులను వినూత్నమైన రీతిలో పరిచయం చేయడం, మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను తయారుచేయడంలో ప్రత్యేకతను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎల్లప్పుడూ నిరూపిస్తూనే ఉంది. కోవిడ్ 19 నేపథ్యంలో తెలుగు ఎన్నారైలకు ప్రశాంతతను, ఉత్సాహాన్ని కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలను తానా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మ్యూజిక్ – మస్తి పేరుతో సంగీత దర్శకులు తమన్‌తో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మే 9వ తేదీన ఈ కార్యక్రమం టీవీ ఏసియా తెలుగు ఛానల్లో లైవ్ అవుతుందని తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలకోసం ఫ్లయర్‌ను చూడండి.













