అట్లాంటాలో తానా హైకింగ్ ఈవెంట్ జయప్రదం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన హైకింగ్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గ్రేటర్ అట్లాంటాలోని కమ్మింగ్ చార్లెస్టన్ పార్క్ లేనియర్ లేక్ ఒడ్డున ఉన్న రోలింగ్ అడవుల్లో జరిగిన ఈ కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. తానా వలంటీర్లు తయారుచేసి అందించిన బ్రేక్ఫాస్ట్ తరువాత ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాజేష్ జంపాల, మురళీ బొడ్డు, అనిల్ యలమంచిలి, వినయ్ మద్దినేని (తానా ఫౌండేషన్ ట్రస్టీ), భరత్ మద్దినేని (జాయింట్ ట్రెజరర్), యువ వలంటీర్లు తనీష్ జంపాల, మోనిష్ జంపాల, రుషిల్ నర్రా, మోహినీష్ మద్దినేని పాదయాత్ర మార్గాన్ని ఎంపిక చేశారు. వెంకట్ మీసాల ఈ కార్యక్రమాన్ని చక్కగా కోఆర్డినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో 6 సంవత్సరాల వయస్సువారి నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉన్నవారు కూడా పాల్గొనడం విశేషం. తానా వలంటీర్ల ఆతిధ్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస లావు, జాయింట్ ట్రెజరర్ భరత్ మద్దినేని, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ హితేష్ వడ్లమూడి, ఫౌండేషన్ ట్రస్టీస్ వినయ్ మద్దినేని, కిరణ్ గోగినేని తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి తమవంతు సహకారాన్ని అందించారు.













