తానా అవార్డులు వీరికే!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను ఈ ఏడాది పలువురు ప్రముఖులకు అందిస్తున్నట్లు తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. 22వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. ఈ దఫా ఎన్టీఆర్ కల్చరల్ అవార్డ్కు ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణను, తానా గుత్తికొండ రవీంధ్రనాథ్ సర్వీస్ అవార్డ్ కోసం డాక్టర్ గంగా చౌదరిని, గిడుగు రామ్మూర్తి అవార్డుకు డాక్టర్ గారపాటి ఉమామహేశ్వరరావు ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన తానా జీవన సౌఫల్య పురస్కారాన్ని ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవార్డును వాషింగ్టన్లో అందజేస్తామని, వివరాలను తానా 2019 వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.













