విజయవంతముగా ముగిసిన తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంపు
అనంతపురం జిల్లా ములకనూరు గ్రామం నందు తానా ఫౌండేషన్, పుష్పగిరి హాస్పిటల్ సంయక్తముగా అక్టోబర్ ఇరభై మూడవ (October 23 2022) తేదీ మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరిగినది. సుమారు మూడువందల యాభై పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది. కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ పడిపాటి గంగాధర్, ఎంపీపీ గోవిందు, పెద్దలు ఎర్రబోతుల ప్రెసిడెంట్ వారి తిప్పన్న, దండా గోవిందప్ప, సాక్ష్యం ఫౌండేషన్ జిల్లా సెక్రటరీ మల్లికార్జున గారు, అనిమేష్ గారు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమానికి ఎర్రబోతుల చంద్రమోహన్ నాయుడు స్పాన్సర్ చెయ్యడం జరిగినది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.













