టేకులపల్లి మండలం కొత్త తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సుమారు లక్ష రూపాయలు విలువైన డ్యూయల్ బెంచెస్ అందజేసిన తానా
తానా మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి తునుగుంట్ల శిరీష తండ్రి మిట్టపల్లి పాండురంగారావు హాజరై తానా ఆధ్వర్యంలో గతంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరిగిందని. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు, రాష్ట్ర ప్రతినిధులు అత్తులూరి ఉమామహేశ్వరరావు, టేకులపల్లి మండలం ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ ఎస్ఎంసి చైర్మన్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.













