తానా ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కర్నూలు నగరంలోని రహదారుల పక్కన నిద్రిస్తున్న అభాగ్యులకు డిఎస్పీ కే. వి. మహేష్, డిఎస్పీ మహేష్ రెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డిఎస్పీ కే. వి. మహేష్ మాట్లాడుతూ తానా చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందనీయమని, గతంలో కూడా తానా ఆధ్వర్యంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి, కార్యదర్శి పొట్లూరి రవి, కమిటీ చైర్ రామ్ చౌదరి, తానా సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు.
కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ చలిలో చిన్నారులు, మహిళలు, వృద్దులు నిద్రిస్తున్న దీనస్థితిపై తానా కార్యదర్శి రవి పొట్లూరి దృష్టికి తీసుకురావడటంతో వెంటనె పొట్లూరి రవి తన వంతు సాయంగా దుప్పట్లు అందజేశారని, పోలీసు శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం చాలా సంతృప్తినిచ్చిందన్నారు.
కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు ఉన్నతాధికారులు, మీనాక్షి, సందడి మధు తదితరులు పాల్గొన్నారు.













