మార్చి 24 నుంచి శ్రీ మహావిష్ణు సుదర్శన యాగం…శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం
కెనడాలో కల్గరీలో ఉన్న శ్రీ అనఘదత్త సొసైటీ హిందూ ధర్మ పరిరక్షణకోసం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాల్సిందిగా అనఘదత్త సొసైటీ కోరుతోంది. లోకసంక్షేమంకోసం శ్రీ అనఘదత్త సొసైటీ ఆధ్వర్యంలో మార్చి 24 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు శ్రీ మహావిష్ణు సుదర్శన యాగం నిర్వహిస్తోంది. మహావిష్ణు సుదర్శన మంత్రంతోపాటు, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కూడా భక్తులంతా చేయాలని కోరుతోంది. కోవిడ్ 19 వైరస్ నుంచి ముప్పు తొలగించుకోవడానికి ప్రతి భక్తుడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఈ వైరస్ బారి నుంచి తప్పించవచ్చని చెబుతోంది. కోటి సహస్రనామ పారాయణం చేయాలని సొసైటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు భక్తులంతా ఆర్థికంగా కూడా సహకరించాలని కోరుతోంది. కోవిడ్ 19 వైరస్ నుంచి మనలను రక్షించేందుకు భగవంతుని నామమే శరణ్యమని అంటూ ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని స్వామవారి కృపకు పాత్రులవ్వాలని సొసైటీ కోరుతోంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, వీడియోను ఇక్కడ చూడవచ్చు.













