స్పైడర్ మ్యాన్ సృష్టికర్త ఇకలేరు
స్పైడర్‌మ్యాన్ కామిక్ క్యారక్టర్ సహసృష్టికర్త స్టీవ్ డిట్కో కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. న్యూయార్క్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 29వ తేదీన తన మన్హటన్ ఫ్లాట్‌లో ఆయన కదలలేని స్థితిలో కనిపించారు. డిట్కో మృతి పట్ల ప్రఖ్యాత రచయిత నీల్ గేమన్ నివాళి అర్పించారు. మార్వెల్ కామిక్స్ కోసం డిట్కో పనిచేశారు. 1960 దశకం తొలి రోజుల్లో ఆయన ఫేమస్ స్పైడర్‌మ్యాన్ క్యారక్టర్‌ను డిజైన్ చేశారు. డాక్టర్ స్ట్రేంజ్ క్యార్టకర్ రూపకల్పనలో డిట్కో పనిచేశారు. మార్వెల్ కామిక్స్ సీఈవో స్టాన్ లీ ఇచ్చిన ఐడియాకు డిట్కో ప్రాణం పోశారు. సాలీడు శక్తులతో టీన్ సూపర్‌హీరోను క్రియేట్ చేయాలని లీ సూచించాడు. దానికి తగ్గట్టుగా డిట్కో స్పైడర్‌మ్యాన్ వేషధారణను డెవలప్ చేశాడు. బ్లూ, రెడ్ డ్రెస్‌తో పాటు మణికట్టులో వెబ్ సూటర్స్ ఉన్న స్పైడర్‌ను డిట్కో డిజైన్ చేశాడు.













