రెండు దేశాలతో మాట్లాడుతున్నాం : ట్రంప్
భారత్, చైనా సరిహద్దులో చాలా తీవ్రమైన ప్రతిష్టంభన నెలకొని ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గేలా తమ అధికార యంత్రాంగం రెండు దేశాలతోనూ మాట్లాడుతోందని వెల్లడించారు. ఓక్లహామా రాష్ట్రంలోని టుల్సీలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించడానికి వెళ్తూ శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మేం భారత్తో మాట్లాడుతున్నాం. చైనాతోనూ మాట్లాడుతున్నాం. వారికి పెద్ద సమస్య వచ్చి పడింది. వారక్కడ కొట్టుకున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. వారికి సహకరించడానికి ప్రయత్నిస్తాం అని తెలిపారు. గత కొద్ది రోజులుగా అధికార యంత్రాంగం మొత్తం భారత్కు అండగా ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది.













