సిలికానాంధ్ర రజతోత్సవాలు… గిన్నీస్ రికార్డు సృష్టించిన శతకశంఖారావం
(ఓక్ లాండ్ ఎరీనా నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు)
సిలికానాంధ్ర తన 25 సంవత్సరాలు వేడుకను విభిన్నంగా చేయడంతోపాటు గిన్నిస్ రికార్డులను సృష్టించడం విశేషం. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆనంద కూచిభొట్ల, ప్రస్తుత అధ్యక్షురాలు సత్యప్రియ తనుగులతోపాటు సిలికానాంధ్ర టీమ్, వలంటీర్లు ఎంతో శ్రమించి ఈ వేడుకను అద్భుతంగా దిగ్విజయం చేశారు. సిలికానాంధ్ర రజతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన శతక శంఖారావం కార్యక్రమం కూడా గిన్నిస్ రికార్డును సాధించింది.
మనందరికీ చిన్నప్పుడు తెలుగులో నేర్చుకున్న సుమతి శతకం, వేమన శతకం లోని పద్యాలు గుర్తు ఉండే ఉంటాయి అమెరికాలో తెలుగు పిల్లలకి తెలుగు నేర్పించాలన్న ఉద్దేశంతో 2007లో ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి 2026కి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ పిల్లలకి వారి తల్లితండ్రులు కూడా పాల్గొనేలా చేసిన కార్యక్రమమే శతక శంఖారావం. ఈ సందర్భంగా సుమతి, వేమన శతకాలలోని పద్యాలను చెప్పడమే ఈ కార్యక్రమం. రజతోత్సవ వేడుకలు నిర్వహించిన ఓక్లాండ్ ఏరీనాలో 1712 మంది కూర్చుని 18 పద్యాలను లయబద్ధంగా చూడకుండా చెప్పటమే శతక శంఖారావం. ఈసారి కూడా గిన్నిస్ అధికారి మైఖేల్ స్టేజ్ మీదకు వచ్చి 1712 మంది 18 పద్యాలను చెప్పడం ఇది ఒక రికార్డు అని ప్రకటించారు సిలికాన్ ఆంధ్ర కార్యవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు, మనబడి పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇందులో పెద్దఎత్తున పాల్గొనడం విశేషం.
మొత్తంగా సిలికానాంధ్ర ర్పుతోత్సవ వేడుకలు మÖడుగిన్నిస్ రికార్డులను సాధించి, అమెరికాలో తెలుగువారి సత్తాను, మన సంస్కృతీసంప్రదాయాలను మరోమారు చాటి చెప్పింది.








