అమెరికాలో మరోసారి జాతి వివక్ష …
అమెరికాలో జాతి వివక్ష మరోసారి పడగ విప్పింది. న్యూ మెక్సికో రాష్ట్రంలోని శాంటే ఫీ సిటీలో భారత్ సంతతికి చెందిన సిక్కు వ్యక్తి రెస్టారెంట్లో విధ్వంసం జరిగింది. దుండగులు విధ్వంసానికి పాల్పడటంతో పాటు గోడలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల రెస్టారెంట్ యజమానికి లక్ష డాలర్ల నష్టం వాటిల్లిందని తెలిసింది. దీనిపై స్థానిక పోలీసులు, ఎఫ్బీఐ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్డీఈఎఫ్) ఖండించింది. ఈ సంస్థ డైర్టెక్టర్ కిరణ్ కౌర్ గిల్ మాట్లాడుతూ ఈ తరహా ద్వేషం, హింస ఆమోదయోగ్యం కాదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అమెరికన్లకు భద్రత కల్పించాలి అని డిమాండ్ చేశారు. సదరు వ్యక్తులు దేవతా విగ్రహాల తలలు తొలగించడంతోపాటు కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. మద్యం బాటిళ్లు ఖాళీ చేశారు. కిచెన్ పూర్తిగా ధ్వంసం చేశారు.













