స్టార్లు తప్పుకున్నా నష్టం లేదు
కొంత మంది అగశ్రేణి క్రీడాకారులు తప్పుకున్నంత మాత్రాన యూఎస్ ఓపెన్ నిర్వహణకు వచ్చిన నష్టమేమీ లేదని అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ అభిప్రాయపడింది. కరోనా భయంతో చాలా మంది అగశ్రేణి క్రీడాకారులు యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సెరెనా స్పందించింది. కరోనా నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లలో భయం నెలకొన్న విషయం వాస్తవమేనని తెలిపింది. ఇక టోర్నీలో ఆడాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి క్రీడాకారుడికి ఉంటుందని వివరించింది. ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని కొంత మంది క్రీడాకారులు టోర్నీ తప్పుకుంటున్నారని, ఈ విషయంలో వారిని తప్పు పట్టడం సమంజసం కాదని సృష్టం చేసింది. స్టార్లు లేకున్నా యూఎస్ ఓపెన్ జయప్రదం అవుతుందనే నమ్మకాన్ని సెరెనా వ్యక్తం చేసింది. అయితే జకోవిచ్, బార్టీ, ఫెదరర్, నాదల్ వంటి దిగ్గజాలు దూరం కావడం కాస్త బాధకు గురి చేసిందని వ్యాఖ్యానించింది.













