దేవుడు ఉన్నాడని సైన్స్ ద్వారా రుజువు చేస్తా!
పదకొండేళ్ల ప్రాయంలో ఎవరైనా వీడియో గేమ్స్ ఆడుకుంటారు. కార్టూన్ నెట్వర్క్ ఛానళ్లు చూస్తారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన విలియం మిల్లిస్ మాత్రం ఇలాంటివారందరికీ విభిన్నం. అతడో బాలమేధావి. జులై 21న సెయింట్ పీటర్స్బర్గ్ కళాశాల నుంచి ఆర్ట్స్ డిగ్రీలో అసోసియేట్ గా పట్టా అందుకున్నాడు. 18ఏళ్లకే పీహెచ్డీ పూర్తి చేయాలని, భవిష్యత్తులో ఖగోళ భౌతికశాస్త్రవేత్తగా రాణించి, దేవుడు ఉన్నాడని సైన్స్ ద్వారా రుజువు చేయాలని జీవితలక్ష్యంగా పెట్టుకున్నాడు. డిగ్రీ పట్టా చేతికి వచ్చింది కాబట్టి, దక్షిణఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తానని చెబుతున్నాడు.













