వీహబ్ లో పర్యావరణ వ్యవస్థ : సేల్స్‌ఫోర్స్
అమెరికాకు చెందిన ప్రసిద్ధ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఎరిక్ లోయబ్, సంచాకురాలు శ్వేతార్ కోహ్లిలు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ప్రభుత్వ సలహాదారు వివేక్, ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, వీహబ్ సీఈవో రావుల దీప్తి తదితరులు వీరితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా తర్వాత తమ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న అతి పెద్ద ప్రతిభాకేంద్రం ఏర్పాటు గురించి చర్చించారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీహబ్‌ను ఏర్పాటు చేయడంపై సేల్స్‌ఫోర్స్ ప్రతినిధులు కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. వీహబ్‌లో పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు చేయూతనందిస్తామని సేల్స్‌ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు. దీనికి కేటీఆర్ స్వాగతించారు. సేల్స్‌ఫోర్స్‌కు ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు.













