డెమొక్రాటిక్ అభ్యర్థిత్వం కోసం బరిలో ఎంతమందో తెలుసా?
వచ్చే సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో తలపడే డెమొక్రాట్ల అభ్యర్థి ఎవరు అనేది తేల్చే కీలక ప్రక్రియ మొదలైంది. మాజీ ఉపాధ్యక్షుడు 76ఏళ్ల జాయ్ బిడెన్ మూడవసారి అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్నారు. ఈ అభ్యర్థిత్వం కోసం మొత్తం 24 మంది డెమొక్రాట్లు బరిలోకి దిగారు. మియామిలోని రబ్బర్ మీట్స్ రోడ్డులో రెండు వరుసగా డిబేట్ నిర్వహిస్తారు. ఈ డిబేట్లో అభ్యర్థులు తమ టాలెంట్స్ ప్రదర్శిస్తారు. బిడెన్ తన ప్రత్యర్థుల నుంచి ఈసారి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొలంబియా రాష్ట్రంలో బిడెన్ తన అనుచరులనుద్దేశించి మాట్లాడుతూ, అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఎవరు ఎన్నికైనా మనమంతా కలిసికట్టుగా ఉండాలని అని చెప్పారు. బిడెన్‌కు పోటీగా డెమొక్రాటిక్ సోషలిస్టు 77 ఏళ్ల బెర్నీ శాండర్స్ (గత సారి రెండవ స్థానంలో నిలిచాడు), ఎలిజెబెత్ వారెన్, యువ గే మేయర్ పీట్ బటిగీగ్ తదితరులు రంగంలో ఉన్నారు.
ఒరాక్ ఒబామా హయాంలో బిడెన్ ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. 24 మంది అభ్యర్థుల్లో నిధుల సేకరణ, పోల్ నంబర్లు ఆధారంగా చర్చ (డిబెట్) నిర్వహిస్తారు. నిధుల సేకరణ, పోల్ సంఖ్యలు ఆధారంగా మొదటి 20 స్థానాల్లో ఉన్నవారిని రెండు గ్రూపులుగా విడదీసి చర్చ నిర్వహిస్తారు. ప్రధానమైన చర్చా కార్యక్రమం రెండవ రోజు రాత్రి జరుగుతుంది. ఇందులో బిడెన్, శాండర్స్ ముఖాముఖి తలపడనున్నారు. ప్రజారోగ్యం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపై శాండర్స్ తీసుకున్న ప్రజానుకూల వైఖరి డెమొక్రాటిక్ పార్టీలో ప్రొగ్రెసివ్ శక్తుల మద్దతు చూరగొనేందుకు ఉపయోగపడుతుంది.













