రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గా అధికారికంగా ఎన్నుకోబడ్డ డోనాల్డ్ ట్రంప్
రిపబ్లికన్ ప్రతినిధులు షార్లెట్ లో సోమవారం 24 ఆగస్టు న జరిగిన తమ వ్యక్తిగత స్కేల్-బ్యాక్ జాతీయ సమావేశాన్ని రోల్ కాల్ ఓటింగ్‌తో ప్రారంభించారు. నవంబర్ 3 న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తమ పార్టీకి ప్రాతినిధ్యం వహించడానికి 2016 లో ప్రాతినిధ్యం వహించిన అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను తిరిగి అధికారికంగా ఎన్నుకున్నారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి మిస్టర్ జో బిడెన్ మరియు అతని ఉపాధ్యక్షులు కమలా హారిస్ పై ఎన్నికల యుద్ధానికి GOP టికెట్‌ను అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారికంగా ఖాయం చేశారు.
అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్లోరిడా ని మినహాయించి అక్షర క్రమంలో జరిగిన రోల్ కాల్ ఓటింగ్ లో కరోనా వైరస్ పరీక్షలు మరియు శరీరోష్ణత పరీక్షించిన తరువాత, అమెరికా లోని 50 రాష్ట్రాలు, ఐదు భూభాగాలు మరియు వాషింగ్టన్, డి.సి.లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 336 మంది ప్రతినిధులు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ యొక్క బాల్రూమ్ లో మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ రోల్ కాల్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలిసింది. నవంబర్ ఎన్నికలలో ముందుగానే మెయిల్-ఇన్ ఓటింగ్‌పై సందేహం వ్యక్తం చేసిన అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా రోల్ కాల్ ఓటింగ్ కు హాజరు అయ్యి , “క్రితం సారి మన ప్రచారం పై జరిగిన గూఢ చెరియ తో కొన్ని చెడు విషయాలు జరిగాయి, ఈ సరి కోవిడ్‌ను అడ్డం పెట్టుకుని పోస్ట్ ఆఫీస్ కుంభకోణం ద్వారా డెమొక్రాట్లు అద్ధ్యక్ష ఎన్నికలలో గలవటానికి ప్రయత్నిస్తున్నారు” అని అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఓటర్లకు “చాలా జాగ్రత్తగా ఉండండి మరియు చాలా జాగ్రత్తగా ఎన్నికలను పరిగణించండి, మనం గెలవాలి. మన దేశ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు.” అని సందేశం ఇచ్చారు.పలువురు రిపబ్లికన్ ప్రతినిధులు మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్‌ను ఎన్నుకోవడం మరియు డెమొక్రాటిక్ పార్టీ విలువలకు కట్టుబడి ఉండటం అంటే అమెరికా పతనానికి దారి వేస్తున్నట్లు అని భయంతో నిండిన హెచ్చరికలు చేస్తూ అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అ మెరికాను సరియైన మార్గంలో ముందుకు నడపగలరు అని వ్యాఖ్యలు చేశారు.













