యూఎస్ మేయర్ అభ్యర్థికి బెదిరింపులు
అమెరికా మేయర్ పదవి కోసం పోటీ చేస్తున్న తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రెగీనా ముస్తాఫా తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి కాల్స్ వస్తున్నాయి. ట్విట్టర్ ఖాతాలోనూ కొందరు బెదిరింపులకు పాల్పడారు అని రెగీనా అన్నారు. సమాజానికి తన వంతు సేవ చేయాలని భావిస్తున్నానని అన్నారు. అయిత,ే ఇలాంటి చౌకబారు బెదిరింపుకు తాను భయపడనని అన్నారు. ఎన్నికల్లో తాను పోటీచేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆగంతకులను గుర్తించి శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. రెగీనాకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిల్ ఆన్ ఇస్లామిక్ రిలేషన్ సంస్థ డిమాండ్ చేసింది.













