TANA: తానా కాన్ఫరెన్స్‌కు నినాదం రెడీ….
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) డెట్రాయిట్ లో నిర్వహించనున్న 24వ తానా మహాసభలకు నినాదాన్ని ఖరారు చేశారు. యువతరం మరియు నైపుణ్యం ప్రధాన అంశాలుగా 9 నినాదాలను మేధావులు సూచించారు. అభిప్రాయ సేకరణ ద్వారా, అత్యంత ఆదరణ పొందిన ‘తరతరాల తెలుగు తెలుగుదనం, తరలివచ్చే యువతరం’ అన్న నినాదాన్ని 24 వ తానా మహాసభల నినాదంగా ఖరారు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. అభిప్రాయ సేకరణలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఈ నినాదం ఆధారంగా లోగో తయారు చేసి విడుదల చేస్తామని కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, సమన్వయకర్తగా ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు.







