మరో భారతీయుడు హత్య
అమెరికాలో మరో భారతీయుడు దారుణహత్యకు గురయ్యారు. కాలిఫోర్నియాలో ఓ గుర్తు తెలియని దుండగుడు జగ్జీత సింగ్ (32) అనే సిక్కు వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు. వారం వ్యవధిలో అమెరికాలో ముగ్గురు భారతీయులు హత్యకు గురికావడం విషాదకరం. పంజాబ్లోని కపుర్తలకు చెందిన జగ్జీత్ 18 నెలల క్రితం అమెరికా వెళ్లారు. హట్చ్ ఫుడ్, గ్యాస్ కన్వీనియెన్స్ స్టోర్లో క్లర్గా పనిచేసేవారు. ఓ దుండగుడు స్టోర్కు వచ్చి సిగరెట్లు కావాలన్నాడు. ఐడీ కార్డు చూపించక పోవడంతో సిగరెట్లు అమ్మేందుకు జగ్జీత నిరాకరించారు. దీంతో దుండగుడు జాతివివక్షతో దూషించి, కత్తితో పొడిచినట్టు ప్రత్యక్షసాక్యులు చెప్పారు. జగ్జీతను ఆస్పత్రికి తరలించగా 9 గంటల తర్వాత మరణించారు.













