సురక్షిత ప్రపంచం కోసం ముందుకు రండి
మరింత చక్కని సురక్షితమైన సాహసోపేతమైన సరికొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు ప్రపంచ నాయకులంతా కలిసికట్టుగా కృషి చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అన్నారు. ఐరాస గ్లోబల్ గోల్స్ పురస్కారాల ప్రదానోత్సవంలో ఆమె మాట్లాడారు. యూనిసెఫ్ ప్రపంచ సౌహార్ద్ర రాయబారి అయిన ప్రియాంక చోప్రా భారత్కు చెందిన రియాశర్మకు నాయకత్వ అవార్డును అందజేశారు. మేక్ లవ్ నాట్ స్కార్స్ (ఎంఎల్ఎన్ఎస్) సంస్థను ఏర్పాటు చేసి దానిద్వారా ఆమ్లదాడి బాధితుల సంక్షేమం కోసం రియాశర్మ అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విషయం ఈ సందర్భంగా గమనర్హం. అమ్మాయిల సాధికారత సాధన గురించి ప్రియాంక ప్రత్యేకంగా ప్రస్తావించారు. యూనిసెఫ్ సౌహార్ధ్రరాయబారుల్లో అత్యంత పిన్నవయస్కురాలైన మజూన్ అల్మెల్లేహన్ను ఆమె కలుసుకున్నారు. సిరియాలో బాలికల విద్య కోసం అల్మెల్లేహన్ పోరాడుతున్నారు. ఆమెను మాలాలా ఆప్ సిరియాగా పేర్కొంటారు.













