అమెరికా యువతికి రాష్ట్రపతి హామీ
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పెద్ద మనసును చాటుకున్నారు. అమెరికా యువతి పెళ్లి పనులకు భద్రతాధికారులు ఎలాంటి ఇబ్బంది కలిగించబోరని హామీ ఇచ్చారు. అమెరికాకు చెందిన యాష్లే హాల్ పెళ్లి (మంగళవారం) నేడు జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రపతి కోవింద్ హోటల్లో బస చేస్తున్నందున హోటల్‌ను ఖాళీ చేయమంటూ భద్రతాధికారులు నోటీసులిచ్చారు. దీంతో పెళ్లి వేదికను మరో చోటికి మార్చలేమంటూ ఆమె రాష్ట్రపతి భవన్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన రాష్ట్రపతి యాష్లేకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి వేదికను మార్చుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.













