అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన… షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన బిజీ షెడ్యూల్‌తో ఉంది. ఈ నెల 20న ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకుంటారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరాస సెక్రటేరియట్లో యోగా సెషన్‌కు నాయకత్వం వహిస్తారు. అక్కడి నుంచి వాషింగ్టన్ చేరుకుని 22న వైట్‌హౌస్‌లో బైడెన్‌తో విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతల మధ్య పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. అదేరోజు మధ్యాహ్నం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. 23వ తేదీన యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌లు విదేశాంగశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత యూఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది సీఈవోలతోనూ ప్రధాని మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరుసటి రోజు అమెరికా నుంచి ఢల్లీికి తిరుగు ప్రయాణం అవుతారు.













