వాల్‌స్ట్రీట్ జర్నల్ లో ప్రధాని ప్రత్యేక వ్యాసం
అమెరికా పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాతో భారత వైఖరిని వివరిస్తూ ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఓ ఆర్టికల్ రాశారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా వ్యూహాత్మక సంబంధాలు వివాదరహితమని, ప్రపంచాన్ని ఉగ్రవాదం, తీవవ్రాదం నుంచి రక్షించడానికి, సంప్రదాయేతర ఉగ్రవాద ముప్పు నుంచి కాపాడేంఉదకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. గత జూన్‌లో తాను అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఏడాది తర్వాత, ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న నమ్మకంతో వచ్చానని రాశారు. భారత్, అమెరికా ఎప్పుడు కలిసి పనిచేసినా, ప్రపంచానికి మేలు కలిగిందన్నారు. డెంగ్యూ వ్యాక్సిన్ కనుక్కోవడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రకృతి విపత్తుల సమయంలో మానవీయ సాయంలాంటి ఉదాహరణలను పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రం విషయాన్నీ ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం ఏడాదికి 115 బిలియన్ డాలర్లు దాటిందని, మరిన్ని రెట్లు పెరిగేందుకు సిద్ధంగా ఉందన్నారు.













