మోదీ అమెరికా పర్యటనలో ప్రముఖులతో భేటీ … జాబితా ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులను న్యూయార్క్‌లో కలుసుకోనున్నారు. ప్రధానితో భేటీ అయ్యే ప్రముఖులు జాబితాలో నోబెల్ పురస్కార గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వైద్య ఆరోగ్యరంగానికి చెందిన నిపుణులు ఉన్నారు. వారిలో టెస్లా, స్పేస్ఎక్స్, సీఈవో ఎలాన్ మస్క్, ఆస్ట్రోఫిజిసిస్ట్ నీల్ డెగ్రస్సె టైసన్, నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త పాల్ రోమెర్, విద్యావేత్త నస్సీమ్ టాలెబ్, ప్రముఖ పెట్టుబడిదారు రే దాలియో, పేరొందిన సింగర్ ఫాలు షా, అమెరికా ట్రేడ్ మాజీ ప్రతినిధి ఫ్రోమాన్, దౌత్యవేత్త డేనియల్ రస్సెల్, పొలిటికల్ సైంటిస్ట్ జెఫ్ స్మిత్, రక్షణ విధాన నిపుణుడు ఎల్బ్రిడ్జ్ కోల్బే, రసాయన శాస్త్రానికి నోబెల్ పురస్కార గ్రహీత డాక్టర్ పీటర్ ఆగ్రే, పేరొందిన హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ స్టీఫెన్ క్లాస్కో, గ్రామీ అవార్డుకు నామినేట్ కాబడిన మ్యూజీషియన్ చంద్రికా టాండన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేవారిలో ఉన్నారు.













