ఐక్యరాజ్యసమితిలో మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చేయనున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన ఆయన ప్రసంగిస్తారు. 74వ యూన్ సమావేశాల్లో పలువురు ప్రపంచాధినేతలు మాట్లాడనున్నారు. దాంట్లో భాగంగా మోదీకి కూడా ఆ అవకాశం ఇచ్చారు. న్యూయార్క్ పర్యటన సమయంలో ప్రధాని మోదీ వివిధ దేశాధి నేతలతోనూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. 2014లోనూ మోదీ యూఎన్లో మొదటిసారి ప్రసంగించారు. ఈసారి సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు సుమారు 48 మంది దేశాధినేతలు హాజరుకానున్నారు. మరో 30 మంది విదేశీ మంత్రులు కూడా వెళ్లనున్నారు. సెప్టెంబరు 24వ తేదీన డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతారు.













