ఏకకాలంలో 15 మందితో చెస్!
చెస్ అంటేనే మైండ్‌గేమ్. ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు వ్యూహాలు రచించాలి. ఒక్కరితో చెస్ ఆడి గెలవాలంటేనే ఎంతో కష్టం. కానీ ఏకకాలంలో 15 మందితో ఆడటం అమెరికాకు చెందిన పెగా సిస్టమ్స్ సీఈవో అలన్ ట్రెప్లర్కే సాధ్యం. వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో భాగంగా 15 మంది ప్రతినిధులతో ట్రెఫ్లర్ ఏకంగా స్పీడ్ చెస్ ఆడి ఔరా అనిపించారు. గతంలో ఓసారి యూఎస్‌లో 25 మందితో ఏకకాలంలో చెస్ ఆడి రికార్డులోకెక్కారు. 1980 నుంచి స్పీడ్ చెస్ ఆడుతూ ప్రొఫెషనల్‌గా ఎదిగారు. ఒకేసారి ఇంత మందితో చెస్ ఎలా ఆడగలిగారని ట్రెఫ్లరను ప్రశ్నిస్తే, సాధించాలనే తపన ఉంటే సాధ్యంకానిదేదీ ఉండదు. చాలెంజ్‌ని చేధించడం అలవాటుగా మలుచుకోవాలని చిరునవ్వుతో సమాధానం చెప్పారు.













