తెలుగు వ్యక్తి కి అరుదైన ఘనత… ఐరాసలో
తెలుగు వ్యక్తి అరుదైన ఘనత సాధించారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీశ్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో భారత తదుపరి రాయబారి / శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. 1990 క్యాడర్ ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన హరీశ్ ప్రస్తుతం జర్మనీలో భారతీ రాయబారిగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2021 నవంబర్ 6న జర్మనీలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అప్పట్నుంచి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. అంతకముందు అనేక హోదాల్లో పనిచేశారు. పర్వతనేని హరీశ్ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. గోల్డ్‌మెడల్ కూడా సాధించారు. ఆ తర్వాత ఆయన ఐఐఎం కలకత్తాలో విద్యనభ్యసించారు. ఆయనకు సతీమణి నందిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.







