పాకిస్థాన్‌కు ఊరట….
ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాక్స్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) డార్క్ గ్రే లిస్టులో చేర్చబోతోందంటూ ఇప్పటి వరకూ వార్తలొచ్చాయి. అయితే పాకిస్థాన్ తాజాగా ఈ పరిస్థితి నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాక్ గ్రే లిస్టులో కొనసాగుతోంది. ఒక దేశానికి ఎఫ్ఏటీఎఫ్ డార్క్ గ్రే లిస్టులో చేర్చిందంటే సదరు దేశానికి లాస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే. అయితే వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఉగ్రవాదులకు నిధులందకుండా పూర్తి చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్‌కు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా గడువు లభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతన్న సమావేశంలో పాకిస్థాన్‌కు సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. అయితే పాక్ విదేశాంగ శాఖ మాత్రం ఈ వార్తలు కొట్టిపారేసింది.













