అమెరికా కార్యదర్శికి ఫోన్ చేసిన అజిత్ దోవల్
పుల్వామా ఉగ్రదాడి ఘటన అనంతరం భారత వాయుసేన పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా కార్యదర్శి మికీ పాంపియోతో ఫోన్లో సంభాషించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేసేందుకే తాము వైమానిక దాడులు చేశామని అజిత్ దోవల్ అమెరికా కార్యదర్శికి వివరించారు. దీంతో పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులు చేయడాన్ని అమెరికా సమర్థిస్తుందని మికీ పాంపియో చెప్పారు. జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు పాకిస్థాన్ నేలపై దాడులను అమెరికా కార్యదర్శి మికీ సమర్థిస్తూ భారత్ కు బాసటగా నిలుస్తామని ప్రకటించారు.













