మహా పాదయాత్ర కు ఎన్ఆర్ఐల సంఫీుభావం
రాజధాని రైతులు నేటి నుంచి నిర్వహించనున్న అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు అమెరికాలోని ఎన్ఆర్ఐలు సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలో అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతుగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుచేయాలని, అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని.. అలుపెరగని ఉద్యమం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. ర్యాలీనుద్దేశించి టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుగున్నారని ధ్వజమెత్తారు.













