రైతులపంటను కొన్న ఎన్ఆర్ఐలు
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. చేతికొచ్చిన పంట కొనేవారు లేక పండించిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు సతమవుతున్నారు. దీంతో తెలుగు ఎన్నారైలు డాక్టర్ వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, రమేష్ రెడ్డి వల్లూరు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆంధప్రదేశ్‌లోని కొంతమంది రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో తమ మిత్రులతో టమోటో ఛాలెంజ్ పేరుతో నేరుగా రైతుల వద్ద పంటను కొనుగోలు చేసి వాటిని పేద ప్రజలకు ఉచితంగా అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సేవా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలో 3500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అదే విధంగా వివిధ పల్లెలోని రైతుల దగ్గర కూరగాయలు కొనుగోలు చేసి వాటిని పేద ప్రజలకు ఉచితంగా అందజేశారు.













