రాజధానికి రూ.5 లక్షలు విరాళమిచ్చిన ప్రవాసాంధ్రులు
అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు ఎన్నారైలు కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, సుధాకర్‌లు అందజేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తమ తల్లిదండ్రులు స్వర్గీయ కాట్రగడ్డ సుబ్బారావు, కాళికాంబ దంపతుల జ్ఞాపకార్థం రాజధాని అమరావతికి రూ.5 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాల్లో ఎన్నారైలుు భాగస్వాములు కావాలన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మార్కెట్‌యార్డు వైస్ ఛైర్మన్ అయినంపూడి వెంకట శ్రీధర్, టీడీపీ నాయకులు కాకుమాను కనకరాంబాబు, కొత్తమాసు హేమశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.













