చరిత్రలో నిలిచిపోనున్న సభ
ప్రగతి నివేదన తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంటుందని యునైటెడ్ కింగ్డమ్ ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ విభాగం వ్యాఖ్యానించింది. లండన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ, దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని, ఎవరూ ఆలోచించలేని చారిత్రాత్మక సభకు కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నదని, పాతిక లక్షల కంటే ఎక్కువగానే ప్రజలు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. గత నాలుగున్నరేండ్లుగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టే నివేదన సభ మాత్రమే కాక అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ కృతజ్ఞత తెలుపుకనే వేదిక కూడా అని వ్యాఖ్యానించారు.













