మిల్పిటాస్ లో చంద్రబాబు ఆరోగ్యం కోసం పూజలు
బే ఏరియాలోని మిల్పిటాస్ లో ఉన్న వేద టెంపుల్ లో ఆరుగురు వేద పండితులు అత్యంత నిష్ఠతో చంద్రబాబు గారి గోత్ర నామాల మీద అర్చన చేశారు.
చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, తిరిగి రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రిగా పాలనా నాయకత్వం వహించాలని, న్యాయస్థానాలు వేదికగా ఆయన చేస్తున్న ధర్మ పోరాటానికి దైవానుగ్రహం తోడవ్వాలని వేడుకుంటూ ఈ రోజు పూజ, అర్చనలు నిర్వహించటం జరిగింది.
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు సిద్ధించి తిరిగి అతి త్వరలో ప్రజా సేవలో పాల్గొంటారని వారు దీవించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం మరియు జనసేన అభిమానులు హాజరయ్యారు.













