మంత్రి జూపల్లిని కలిసిన ఎన్ఆర్ఐ జలగం సుధీర్ కుమార్
గ్రామీణ ప్రాంతంలో అనేక సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావును ఎన్ఆర్ఐ జలగం సుధీర్‌కుమార్ హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామాల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మన ఊరు-మన ఎన్ఆర్ఐ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఊరి నుంచి ముందుకు వచ్చిన ఒకరిద్దరు ఎన్ఆర్ఐలను ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తే వారి మిగిలిన ఎన్ఆర్ఐలతో గ్రామస్థులు, సర్పంచులను సమన్వయం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాలున్నాయన్నారు. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణవాదులు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి చేస్తున్న కృషి ప్రవాస భారతీయులెందరికో ఆదర్శమన్నారు.













